దుబాయ్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. కీలకమైన క్వాలిఫయర్-1లో మ్యాచ్‌లో ఢిల్లీపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తొలి ఓవర్లోనే పృథ్వీ షా(0), అజింక్యా రహానే(0) వెంటవెంటనే ఔటయ్యారు. సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయారు. స్టోయినిస్(65; 46 బంతుల్లో 4×6, 6×3) బ్యాట్ ఝుళిపించాడు. అక్షర్ పటేల్(42; 4×2, 6×3) ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు. కృనాల్ పాండ్యా, పొలార్డ్‌కు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినప్పటికీ మరొక అవకాశం ఉంది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజేతతో ఢిల్లీ క్వాలిఫయర్-2లో తలపడనుంది.
ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్లలో డీకాక్(40; 25 బంతుల్లో 4×5, 6×1), సూర్యకుమార్ యాదవ్(51; 38 బంతుల్లో 4×6, 6×2), ఇషాన్ కిషన్(55 నాటౌట్; 30 బంతుల్లో 4×4, 6×3) రాణించడంతో ముంబై భారీ స్కోరుచేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ తీసుకోవడంతో ముంబై ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ముంబై ఇండియన్స్ ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మను వికెట్‌ను కోల్పోయింది. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ధాటిగా ఆడారు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. పొలార్డ్(0) డకౌట్ కాగా, కృనాల్ పాండ్యా(13) భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. చివరిలో హార్దిక్ పాండ్యా ధాటిగా ఆడి 37(14, బంతుల్లో 6×5) పరుగులు చేశాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అశ్విన్ మూడు వికెట్లు సాధించగా, నోర్జే, స్టోయినిస్‌కు చెరో వికెట్దక్కింది.
- November 5, 2020
- Top News
- DELHICAPITALS
- HYDERABAD
- MUMBAIINDIANS
- ROHITHSHARMA
- ఢిల్లీ క్యాపిటల్స్
- బుమ్రా
- ముంబై ఇండియన్స్
- రోహిత్ శర్మ
- హైదరాబాద్
- Comments Off on ఢిల్లీకి ఘోర పరాభవం.. ఫైనల్లో ముంబై