Breaking News

డీజీపీని కలిసి కర్నూలు ఆఫీసర్లు

డీజీపీని కలిసి కర్నూలు ఆఫీసర్లు

సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాలో శుక్రవారం జరిగిన ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్థానిక కర్నూలు ‘బి’ క్యాంపులోని పోలీసు గెస్ట్​ను సందర్శించారు. ఆయన జిల్లా ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్​కు బయలుదేరి వెళ్లారు. డీజీపీని కలిసిన వారిలో కర్నూలు రేంజ్ డీఐజీ పి.వెంకటరామిరెడ్డి, కలెక్టర్ జి.వీరపాండియన్, కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, జేసీ రవిపట్టాన్ శెట్టి, ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, ట్రైనీ కలెక్టర్ నిధిమీనా, ట్రైనీ ఐపీఎస్​ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఉన్నారు.