బెల్గ్రేడ్: ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ నిర్వహించిన అడ్రియన్ టూర్ ఎగ్జిబిషన్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లలో కరోనా బాధితులు పెరిగిపోతున్నారు. తాజాగా క్రొయేషియా టెన్నిస్ స్టార్ గ్రేట్ గొరాన్ ఇవాని సెవిచ్కు కూడా కరోనా సోకింది. పదిరోజుల క్రితం రెండుసార్లు పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. కానీ మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఇవానిసెవిచ్ వెల్లడించాడు. లక్షణాలు లేకపోయినా తాను వైరస్ బారినపడ్డానని చెప్పాడు. తనతో సన్నిహితంగా ఉన్న వారంతా ముందు జాగ్రత్త చర్యగా పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.
క్రొయేషియాలో నిర్వహించిన రెండో అంచె పోటీల సందర్భంగా ఈ వైరస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ టోర్నీలో పాల్గొన్న జొకోవిచ్, దిమిత్రోవ్, బోర్నా కోరిచ్, విక్టర్ ట్రయెస్కీ ఇప్పటికే కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు.