సారథిన్యూస్, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్ విన్నవించిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ నాలుగు వారాల తరువాత ఈ కేసుకు సంబంధించిన వివరాలు వింటామని పేర్కొన్నది.
- July 3, 2020
- Archive
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- GOVERNMENT
- HIGHCOURT
- JOURNALIST
- జర్నలిస్టులు
- హైకోర్టు
- Comments Off on టీ సర్కార్కు హైకోర్టు కీలక ఆదేశాలు