Breaking News

జింబాబ్వే టూర్​కు బీసీసీఐ నో

న్యూఢిల్లీ: ఆటగాళ్లు ఔట్​ డోర్ ట్రైనింగ్ మొదలు పెట్టకపోవడం, దేశంలో కరోనా అదుపులోకి రాకపోవడంతో.. బీసీసీఐ మరో కీలకనిర్ణయం తీసుకుంది. లంక పర్యటన దారిలోనే.. జింబాబ్వే టూర్​ను కూడా రద్దుచేసింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 22వ నుంచి జింబాబ్వేతో కోహ్లీనే మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే కరోనా ముప్పు కారణంగా ఈ పర్యటన నుంచి వైదొలుగుతున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. భవిష్యత్లోనూ దీనిని కొనసాగించే అవకాశాల్లేవన్నారు.

మరోవైపు క్రికెటర్ల ఔట్​ డోర్ ట్రైనింగ్​కు సంబంధించి పూర్తి షెడ్యూల్ రూపొందించలేదన్నారు. అనుకూలమైన వాతావరణం ఉన్నప్పుడే తమ ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెడతారని స్పష్టంచేశారు. ఈ సమయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు అడ్డు తగిలే ప్రయత్నాలను తాము చేయబోమన్నారు. ప్రస్తుతం పరిస్థితులకు తగ్గట్టుగా నడుచుకోవడమే తమ ముందున్న లక్ష్యమని షా చెప్పుకొచ్చాడు.