సారథి న్యూస్, ఎల్బీ నగర్: సీఎం కేసీఆర్ చేనేత కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నట్లు ప్రకటించడం సంతోషకరంగా ఉందని చేనేతకార్మిక సంఘం ఎల్బీ నగర్ అధ్యక్షుడు చెర్కుస్వామి నేత అన్నారు. శనివారం ఎల్బీ నగర్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈనెల 19న ‘చేనేతకు చేయూత’పథకంతో చేనేతలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా జీవోను తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు. దీంతో చేనేతల ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.60వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధిపొందేలా రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ఏర్వ నర్సింహ్మ, ఉపాధ్యక్షుడు గుర్రం శేఖర్, నల్ల శంకర్, మార్కండేయ, వెంకటేశం, శ్రీరంగం, రమేష్, శ్రీనివాస్, రాములు, కవిత, మణెమ్మ పాల్గొన్నారు.
- June 20, 2020
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- హైదరాబాద్
- CM KCR
- LB NAGAR
- చేనేత
- చేయూత
- Comments Off on చేనేతలకు సీఎం చేయూత