Breaking News

‘చలో కలెక్టరేట్’ వాయిదా

‘చలో కలెక్టరేట్’ వాయిదా

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల పూర్వవిద్యార్థి సూగూరు రామచంద్రం హోటల్​ను కూల్చివేసిన దుండగులను శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ జనవరి 11న నిర్వహించతలపెట్టిన ‘చలో కలెక్టరేట్’​ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, సామాజిక ఉద్యమ సంఘాల మద్దతును దృష్టిలో ఉంచుకుని, అందరినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా వాయిదావేసినట్లు ఆయన స్పష్టంచేశారు. త్వరలో తదుపరి తేదీ, కార్యాచరణను ప్రకటిస్తామని, ఈ విషయాన్ని జై భీమ్ యూత్ ఇండియా నాయకులు, కార్యకర్తలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.