Breaking News

గురుకులాల ప్రవేశ ఫలితాలు రిలీజ్​

సారథి న్యూస్​, మహబూబ్​నగర్​: తెలంగాణ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్మీడియట్​, ఒకేషనల్​ కళాశాలల్లో ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సంస్థ వెబ్​సైట్​ www.tswreis.ac.inలో అందుబాటులో ఉంచినట్టు గురుకులాల మహబూబ్​ నగర్​ రీజినల్​ కోఆర్డినేటర్​ ఫ్లారెన్స్​రాణి తెలిపారు. వీటితోపాటు 6 నుంచి 9 తరగతుల్లో బ్యాక్​లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్టు సోమవారం వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్స్​ సమాచారం అందిస్తారని చెప్పారు. ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్​ సర్టిఫికెట్స్​తో పాఠశాలలు, కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. కళాశాలల వివరాలు.. నారాయణపేట (జనరల్​, వొకేషనల్​), మరికల్​(జనరల్​), ఆర్​ఆర్​ గూడెం( జనరల్​, వొకేషనల్​), దేవరకద్ర(వొకేషనల్​), ఉట్కూరు(వొకేషనల్​), జడ్చర్ల(జనరల్​), వంచర్ల(జనరల్​), అలంపూర్​(జనరల్​), ఇతర వివరాలకు సమీప గురుకుల పాఠశాల లేదా కళాశాలలో సంప్రదించాలని తెలిపారు. వివరాల కోసం 7032710193, 7989902033 సంప్రదించాలని సూచించారు.