సారథి న్యూస్, హైదరాబాద్: మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన (బీసీ) సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధీనంలోని గురుకుల కాలేజీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించినట్లు సంస్థ కార్యదర్శి మల్లయ్య భట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 వరకు ఉన్న గడువును 19 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో బాలబాలికలకు, మహిళా డిగ్రీ కాలేజీల్లో ఫస్టియర్‌లో అడ్మిషన్లు ఉంటాయని వివరించారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
లాటరీ కాదు.. ప్రవేశ పరీక్షే: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో లాటరీ పద్ధతిలో ప్రవేశాల ఎంపిక ఉంటుందంటూ వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కోరారు. ప్రవేశ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని స్పష్టంచేశారు.
Sir i want to join in you college