న్యూఢిల్లీ: డోప్ పరీక్షకు హాజరు కాకపోవడంతో.. వంద మీటర్ల ప్రపంచ చాంపియన్, అమెరికా స్టార్ స్ర్రింటర్ క్రిస్టియన్ కోల్మన్పై సస్పెన్షన్ వేటుపడింది. విచారణ పూర్తయ్యే వరకు అతను ఎలాంటి ఈవెంట్లలో బరిలోకి దిగకూడదని ప్రపంచ అథ్లెటిక్స్ ఇంటిగ్రేటి యూనిట్(ఏఐయూ) వెల్లడించింది. అయితే డిసెంబర్ 9న శాంపిల్స్ సేకరించే సిబ్బంది తన ఇంటికి వచ్చినా.. కనీసం ఫోన్ కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పాడు. ఆ సమయంలో తాను పక్కనే షాపింగ్ మాల్లో ఉన్నానని తెలిపాడు. ఎప్పుడు, ఎక్కడా నిబంధనను ఉల్లంఘించడం కోల్మన్ కు ఇది రెండోసారి.
- June 19, 2020
- Archive
- Top News
- క్రీడలు
- AIU
- AMERICA
- COLEMAN
- అమెరికా
- క్రిస్టియన్ కోల్మన్
- స్టార్ స్ర్రింటర్
- Comments Off on కోల్మన్పై సస్పెన్షన్ వేటు