కోలివుడ్‌లోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏం అర్హత ఉందని కంగనా రనౌత్‌కు జయలలిత బయోపిక్‌లో నటించడానికి అవకాశం ఇచ్చారంటూ ఆమె వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ ఇండస్ట్రీలో నెపొటిజం (బంధుప్రీతి) అనే మాట ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజాగా తమిళ సినిపరిశ్రమలోనూ నెపోటిజం ఉందంటూ నటి మీరా మిథున్ వ్యాఖ్యానించారు. తమిళ సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న రాజకీయాలే వల్లే కంగనాకు ఈ అవకాశం దొరికిందని మీరా చెప్పుకొచ్చారు. కాగా ఈ అంశంపై కంగానా ఇంకా స్పందించలేదు.