- వాక్సిన్ తీసుకున్న ఇద్దరు వలంటీర్లు నిమ్స్ నుంచి డిశ్చార్జ్
- తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై ప్రయోగాలు
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ హుమన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. తొలి స్వదేశీ వాక్సిన్ ‘కొవాగ్జిన్’పై హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. సోమవారం నిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు వలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ప్రస్తుతం వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత మరోసారి నిమ్స్ ఆస్పత్రిలో రక్త నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. 14 రోజులపాటు వలంటీర్ల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆ తర్వాత మరోసారి నిమ్స్ ఆస్పత్రిలో రక్త నమూనాలను సేకరించి పరీక్షించనున్నారు. వాక్సిన్లోని అన్ యాక్టివేటెడ్ వైరస్ వల్ల శరీరంలోని యాంటీ బాడీలు ఏ మేరకు వృద్ధి చెందుతాయి? సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నాయా? అని పరిశీలిస్తున్నారు. అంతా ఓకే అనుకున్న తర్వాత రెండో డోస్ ఇస్తారు. ఇలా మొత్తం 60 మందిపై నిమ్స్‌లో పరీక్షలు చేస్తారు. కొవాగ్జిన్ వాక్సిన్ను భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.