Breaking News

కాంగ్రెస్​ ప్రాజెక్టుల బాట

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈనెల 2న ప్రాజెక్టుల బాట పట్టాలని సోమవారం కాంగ్రెస్​ నేతలు నిర్ణయించారు. కృష్ణానదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్​ చేయాలని డిమాండ్​ చేస్తూ.. అక్కడే నిరసన దీక్షలు చేపట్టనున్నారు. మంగ‌ళ‌వారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దీక్షలను విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఎవరు…ఎక్కడ?
ఎన్​.ఉత్తమ్​ కుమార్​రెడ్డి, కె.జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, (ఎస్​ఎల్​బీసీ), భట్టి విక్రమార్క, సీతక్క,పోడెం వీరయ్య(పాలేరు ప్రాజెక్టు), ఎ.రేవంత్​రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి(లక్ష్మీదేవిపల్లి పంప్​హౌస్​), నాగం జనార్దన్ రెడ్డి (ఎల్లూరు జలాశయం), జి.చిన్నారెడ్డి(కరివెన), ఎస్.సంపత్​కుమార్(నెట్టెంపాడు), సి.వంశీచంద్​రెడ్డి(కల్వకుర్తి ఎత్తిపోతల పథకం) దీక్షలు చేపట్టనున్నారు.