సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా గురించి భయపడకండి.. మానసికంగా కృంగిపోవద్దు. ధైర్యంగా కాపాడాలని సూచించారు. కరోనా వచ్చినవారు ఎవరికీ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోవద్దని డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
- August 5, 2020
- Archive
- మెదక్
- షార్ట్ న్యూస్
- COVID19
- HARISHRAO
- medak
- SIDDIPET
- TELANGANA
- కరోనా
- మంత్రి హరీశ్‌రావు
- ములుగు
- మెదక్
- సిద్దిపేట
- Comments Off on కరోనాకు భయపడకండి