సారథి న్యూస్, గుంటూరు : గుంటూరు జీజీహెచ్ నుంచి కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ నెల 14వ తేదీన తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో సదరు వ్యక్తి చేరాడు. తెనాలి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు లేక 16 రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. జీజీహెచ్‌కు వచ్చిన నాటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. 12 రోజుల నుంచి భర్త ఆచూకీ కోసం అతని భార్య వెంకాయమ్మ ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. ఆసుపత్రిలో ఎన్ని వార్డులు తిరిగినా… ఎంత మందిని అడిగినా సమాధానం చెప్పే వారు లేరు. జీజీహెచ్ అధికారులను అడిగినా ఫలితం లేదని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఏమైపోయాడో చెప్పండని జీజీహెచ్ వద్ద భార్య కన్నీరు మున్నీరవుతోంది.
- July 28, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- గుంటూరు
- షార్ట్ న్యూస్
- CARONA
- GGH
- TENALI
- కరోనా
- జీజీహెచ్
- తెనాలి
- Comments Off on కరోనా పాజిటివ్ వ్యక్తి అదృశ్యం