కన్నడ యువనటుడు సుశీల్గౌడ (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మధ్యనే బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మ హత్య చేసుకొని అందరికి షాక్ ఇవ్వగా..తాజాగా మరో యువ నటుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని సినీప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్ణాటక మాండ్యలో ఉన్న తన ఇంట్లో సుశీల్ బుధవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. సుశీల్ ఆత్మహత్య చేసుకోవడం కన్నడ సినిమా, టీవీ పరిశ్రమను షాక్కు గురిచేసింది. ప్రస్తుతం ఆయన కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు. దునియా విజయ్ హీరోగా వస్తోన్న ‘సలగ’ సినిమాలో సుశీల్ పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.