సారథి న్యూస్, పెబ్బేరు: రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారుల తీరు మారడం లేదు. తాజాగా వనపర్తి జిల్లా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో సూగూర్ వీఆర్వో రూ. 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సూగూరుకు చెందిన ఆంజనేయులు అనే రైతుకు కొంతకాలంగా అతడి సోదరుల మధ్య భూవివాదం నడుస్తున్నది. వీరి భూసమస్యను పరిష్కరించేందుకు వీఆర్వో లంచం డిమాండ్ చేశాడు. కాగా, ఆంజనేయులు ఏసీబీని సంప్రదించాడు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం వీఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
- August 6, 2020
- Archive
- Top News
- క్రైమ్
- మహబూబ్‌నగర్
- ACB
- PEBBAIR
- VRO
- WANAPARTHY
- ఏసీబీ
- వీఆర్వో
- Comments Off on ఏసీబీకి చిక్కిన వీఆర్వో