ముబై: ‘నేనేమీ ట్రంప్‌ను కాదు. ప్రజలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోను’ అని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. శివసేన పత్రిక సామ్నా కోసం సంజయ్‌రౌత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థాక్రే ఈ కామెంట్స్ చేశారు. ఈ వీకెండ్లో ‘అన్‌లాక్’ ఇంటర్వ్యూ పేరుతో రెండు భాగాలుగా ప్రసారం కానున్న వీడియో టీజర్‌ను సంజయ్ రౌత్ తన ట్విట్టర్‌లోఓ పోస్ట్ చేశారు. అయితే థాక్రే ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో చేశారనే విషయం తెలియాల్సి ఉంది. పూర్తి ఇంటర్వ్యూ ఎయిర్ అయిన తర్వాతే దీనిపై ఒక క్లారిటీ రానుంది.
ముంబై వీధుల్లో ఫేమస్ వడాపావ్ ఎప్పుడు దొరుకుతుంది.. అని సంజయ్‌రౌత్ ప్రశ్నించారు. లాక్డౌన్ ఎప్పుడు తీసేస్తారు అని అడగ్గా, క్రమంగా మినహాయింపులు ఇస్తామని ఉద్ధవ్ చెప్పారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించింది. వైరస్‌ను అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యాడని విమర్శలు వచ్చాయి. కాగా.. ఉద్ధవ్ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. మన దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 833 కేసులు నమోదవడంతో మొత్తం సంఖ్య 3,27,031కు చేరింది. వారిలో 1,82,217 మంది కోలుకోగా, 12,276 మంది చనిపోయారు.