Breaking News

ఉమ్మి ప్రభావం ఉండదు

ముంబై: బంతిని రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిన వాడకపోవడం.. పరిమిత ఓవర్ల క్రికెట్​పై పెద్దగా ప్రభావం చూపదని టీమిండియా పేసర్ దీపక్ చహర్ అన్నాడు. టీ20 ఫార్మాట్​లో ఇది పెద్దగా అవసరం పడదని చెప్పాడు. టెస్ట్ క్రికెట్​కు వచ్చేసరికి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు.

‘వన్డే ఫార్మాట్‌లో తెల్ల బంతి రెండు ఓవర్లు మాత్రమే స్వింగ్‌ అవుతుంది. టీ20లకు వస్తే పిచ్ రెండు, మూడు ఓవర్లు మాత్రమే బాగుంటుంది. దీనివల్ల మూడు ఓవర్లు బంతి బాగా స్వింగ్‌ అవుతుంది. కాబట్టి బంతిని మెరుగుపర్చాల్సిన అవసరం రాదు’ అని చహర్‌ పేర్కొన్నాడు. ఆగ్రాకు చెందిన 27 ఏళ్ల దీపక్‌.. ఇండియా తరఫున 3 వన్డేలు, 10 టీ20లు ఆడాడు.