ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందట. ఇప్పటికే షూట్ కు అవసరమైన సన్నాహాలు కూడా మేకర్స్ చేసుకున్నారు. విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీతో ‘మనం’ అఖిల్ హీరోగా ‘హలో’ అనే చిత్రాలను రూపొందించారు. ఈసారి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో నాగచైతన్యతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చైతూను ఎలా ప్రజెంట్ చేస్తారో చూడాలి.
- July 20, 2020
- Archive
- Top News
- సినిమా
- AKHIL
- NAGACHAITANYA
- SHEKARKAMMULA
- VIKRAM
- నాగచైతన్య
- మనం
- లవ్ స్టోరీ
- హలో
- Comments Off on ఇది హర్రర్ థ్రిల్లర్ కాదు