![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/FLASISFF.jpg?fit=192%2C192&ssl=1)
జోహెన్స్‌బర్గ్: చెన్నై సూపర్‌కింగ్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఆలోచనాపరులు ఎక్కువ మంది ఉన్నారని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాఫ్ డు ఫ్లెసిస్ అన్నాడు. దీనివల్లే సూపర్‌కింగ్స్ ఐపీఎల్లో బాగా విజయవంతం అవుతుందన్నాడు. ‘చెన్నైతో నా అనుబంధం విడదీయలేనిది. మాది కామ్ డ్రెస్సింగ్ రూమ్. దిగ్గజ కెప్టెన్ ధోనీతో పాటు చాలా మంది ఆలోచనాపరులు ఉన్నారు. వీళ్ల అనుభవం టీమ్‌కు అదనపు బలం. ప్రతి ఒక్కరిలో ఓ నమ్మకం ఉంటుంది. అవే మాకు విజయాలను తెచ్చిపెడుతున్నాయి. ప్రతి ప్లేయర్ చాలా స్ఫూర్తి ర్తిదాయకంగా నిలుస్తాడు. కాస్త ప్రోత్సాహం ఇస్తే అద్భుతాలు చేస్తారు. నైపుణ్యానికి, అనుభవానికి మా టీమ్‌లో కొరత లేదు’ అని డు ఫ్లెసిస్ వ్యాఖ్యానించాడు.