సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆర్యవైశ్య సంఘం పెద్దశంకరంపేట మండలాధ్యక్షుడు రాగం సంగయ్య (73) బుధవారం ఉదయం కన్నుమూశారు. వారం రోజుల అతనికి కరోనా వ్యాధి నిర్ధారణ కావడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆయన మృతిచెందారు. రాగం సంగయ్య పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారని పలువురు కొనియాడారు. ఆయన మృతిపట్ల ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, పెద్దశంకరంపేట సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్ తదితరులు సంతాపం తెలిపారు.
- November 18, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- ARYAVYSHYA SANGAM
- CAROONA
- medak
- PEDDASHANKARAMPET
- ఆర్యవైశ్యసంఘం
- కరోనా
- పెద్దశంకరంపేట
- మెదక్
- Comments Off on ఆర్యవైశ్య సంఘం నేత సంగయ్య కన్నుమూత