రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి ప్రతి విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది. 2018 నవంబర్ లో ప్రారంభమై ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై టైటిల్ దగ్గర నుంచి స్టార్ క్యాస్టింగ్ వరకు అన్నింటిలోనూ బెస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ‘రౌద్రం రణం రుధిరం’ పేరుతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఈ ఏడాది జూలై 30న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ లో ఆలస్యం, వీఎఫ్ఎక్స్ కు చాలా సమయం పట్టడంతో 2021 జనవరి 8న విడుదల చేస్తునట్లు ప్రకటించారు. ఇప్పుడు లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ పడడంతో ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయలేమని ఓ ఇంటర్వ్యూలో నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు. ‘ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నాం. అయితే లాక్ డౌన్ కారణంగా మా ప్లానింగ్ వర్కౌట్ కావడం లేదు. ప్రభుత్వం అనుమతిస్తే పరిమిత సిబ్బందితో కలిసి వర్క్ చేస్తాం. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. అలాగే వీఎఫ్ఎక్స్ కు ఇంకాస్త ఎక్కువ సమయం కావాల్సి ఉంటుంది. కనుక సంక్రాంతికి విడుదల సాధ్యం కాకపోవచ్చు’ అని చెప్పారు. ప్రస్తుతానికైతే విడుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఎన్టీఆర్ బర్త్ డే కి మాత్రం సర్ ప్రైజ్ ట్రీట్ ఉంటుందని దానయ్య చెప్పారు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ తో గుడ్ న్యూస్ అందుకున్న ఫ్యాన్స్, విడుదల విషయంలో మాత్రం తమకు బ్యాడ్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలుపెట్టేశారు. ఇదిలా ఉంటే బాహుబలి– 2 విడుదలైన ఏప్రిల్ 28న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నారు చాలామంది.
- May 18, 2020
- Top News
- సినిమా
- DVV
- RAJAMOULI
- RRR
- రాంచరణ్
- రౌద్రం రణం రుధిరం
- వీఎఫ్ఎక్స్
- Comments Off on ఆర్ఆర్ఆర్ కు బ్రేక్