సారథి న్యూస్, హైదరాబాద్: ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రూ.1.23 కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్ లను అందించారు. వాటిని సోమవారం హైదరాబాద్ ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు చేతులమీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. ఎమ్మెల్సీ పి.మహేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, హుజుర్నగర్ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
- January 11, 2021
- Archive
- తెలంగాణ
- KHAMMAM MP
- KTR
- NAMA NAGESHWARRAO
- PRAGATHIBHAVAN
- కేటీఆర్
- ఖమ్మం ఎంపీ
- నామా నాగేశ్వర్రావు
- ప్రగతిభవన్
- Comments Off on ఆరు అంబులెన్స్‌లు అందించిన ఎంపీ నామా