సారథి న్యూస్, రామగుండం: ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి అన్నిరంగాల్లోనూ అద్భుతాలు సాధించవచ్చని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఓ జాతీయ సదస్సును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మైనింగ్ ఇంజినీరింగ్ నిపుణులు, వివిధ శాఖల అధికారులు ఈ సదస్సులో పాల్లొన్నారు. వారంపాటు ఈ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగనున్నది. కార్యక్రమంలో మైనింగ్ సేఫ్టీ (సౌత్ సెంట్రల్ జోన్) డిప్యూటీ డైరెక్టర్ మలయ్ టికేదార్, డిప్యూటీ డెరెక్టర్ ఆఫ్ మైన్ సేఫ్టీ మహ్మద్ నియాజీ, మల్లారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రవీంద్ర, కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.
- August 3, 2020
- Archive
- తెలంగాణ
- COLLEGE
- MALLAREDDY
- MINIS
- SINGARENI
- టెక్నాలజీ
- సింగరేణి
- Comments Off on ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు