సినిమాలతో పాటు సోషల్ మీడియాకి ఎప్పుడూ టచ్లో నే ఉంటుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా చలామణీ అవుతున్న రష్మిక మందన్న ఏదైనా సినిమాకి సైన్ చేసే ముందు చాలా ఆలోచిస్తుందట. ఆ విషయాన్ని తన అభిమానితో చాట్ చేస్తున్నప్పుడు బైట పెట్టింది. ప్రస్తుతం లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్స్ ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఈ గ్యాప్లో రష్మిక తన ముచ్చట్లను అభిమానులతో పంచుకుంటోంది. ‘నేను ఏదైనా సినిమాలో నటించాలంటే నా పాత్రకు ఎమోషన్ డెప్త్ కచ్చితంగా ఉండాలి.. అలాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టెయిన్ మెంట్ అందించే విధంగా కూడా ఉండాలి. కథలో నా పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే ఆ సినిమా చేయడానికి కమిటవుతా..’ అంటున్న ఈ బ్యూటీ తన మొదటి సినిమా ‘కిరాక్ పార్టీ’ నుంచి ఇదే పద్ధతి పాటిస్తోందట. ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో బన్నీతో జోడీ కడుతోంది. ఈ మూవీలో చిత్తూరి యాస మాట్లాడుతూ పల్లెటూరి అమ్మాయిలా అభిమానులను అలరించనుందని టాక్.
- July 6, 2020
- Archive
- Top News
- సినిమా
- RASHMIKA
- SOCIALMEDIA
- TOOLYWOOD
- కన్నడ
- టాలీవుడ్
- రష్మిక
- Comments Off on అలా అయితేనే చేస్తా..