ఒకే ఒక కన్నుగీటుతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ ల జాబితాలోకి వెళ్లిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. అయితే పాపులారిటీ తో పాటు ట్రోలింగ్ బాధ కూడా తప్పడం లేదు ప్రియకి. రీసెంట్ గా ప్రింటెడ్ లెహంగా ధరించిన ప్రియా లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఆమె లుక్ పై కొందరు కామెంట్స్ పెడుతూ ట్రోల్స్ చేశారు. ఈసారి మాత్రం ప్రియ ఏ మాత్రం బెదరకుండా.. ‘మీరు చేసిన కామెంట్స్ లో పావు వంతుకూడా నేను చదవలేకపోయాను.. మిమ్మల్నందర్నీ తట్టుకుని ఇంతదూరం వచ్చినందుకు గర్విస్తున్నా.. ప్రతి స్త్రీ కూడా ఇలా నాలాగే ఉండాలి..’అంటూ ఓ స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చింది. దీంతో నెటిజన్లు కాస్త కంగు తిన్నమాట వాస్తవమే. ప్రస్తుతం ప్రియా నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘చెక్’చిత్రంలో చాన్స్ దక్కించుకోవడమే కాదు రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు మరో హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తోంది. అలాగే మలయాళంలో ఓ చిత్రం, కన్నడలో ఓ సినిమా.. వీటితో పాటు తమిళ్ లో విక్రమ్ కొడుకు ధృవ్ సినిమాలో సోలో హీరోయిన్గా అవకాశాన్ని కూడా చిక్కించుకుందని సమాచారం.
- October 16, 2020
- Archive
- Top News
- సినిమా
- CHANDRASHEKAR
- NITHIN
- PRIYAPRAKASHWARRIOR
- RAKULPREETHSINGH
- చంద్రశేఖర్
- ధృవ్
- నితిన్
- ప్రియాప్రకాష్ వారియర్
- రకుల్ ప్రీత్‌సింగ్
- విక్రమ్
- Comments Off on అమ్మాయిలంతా నాలా ఉండాలి