సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : తిమ్మాజిపేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారత్ – చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు, ఇతర వీర జవాన్లకు ఘన నివాళలర్పించారు.స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద కాగడల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లను ఈ దేశం ఎప్పటికి మరిచిపోదు అన్నారు, దేశ సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లు నిరంతరం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్షణ కల్పిస్తూ ఉండడం వల్లె ప్రజలమంతా సంతోషంగా ఉండగలుగుతున్నామని అన్నారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ కల్పన, వైస్ చైర్మన్ బాబు రావు జడ్పీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్లు సునీత, విజయమ్మ, పద్మమ్మ, రాజుకుమార్ రెడ్డి, ఇస్సాక్ మియా,ఖాజా ఖాన్ పాల్గొన్నారు
- June 19, 2020
- Archive
- Top News
- NAGARKURNOOL
- TIMMJIPET
- కల్నల్ సంతోష్
- టీఆర్ఎస్
- Comments Off on అమర జవానులకు ఘననివాళి