Breaking News

సీఎంపై యువకేరటం విజయం

సీఎంపై యువకేరటం విజయం

యానాం: తూర్పుగోదావరి జిల్లా యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి, ‘నమస్తే యానాం’ పేరుతో రాజకీయ అరంగేట్రం చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ మాజీ ముఖ్యమంత్రి రంగస్వామిపై సంచలనం విజయం సాధించారు. 20ఏళ్ల రాజకీయ దిగ్గజం ముద్దాడి కృష్ణారావు కంచుకోటను ఒక యువకుడు నెలకూల్చాడు. యానాంలో చరిత్ర సృష్టించాడు. గెలుపు దోబుచులాడినప్పటికీ చివరికి విజయాన్ని సొంతం చేసుకున్నారు. 16 రౌండ్లు తన ఆధిక్యతను చాటుతూ చివరికి 655 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నాడు తండ్రి.. నేడు తనయుడు
శ్రీనివాస్‌ అశోక్‌ తండ్రి గంగాధర ప్రతాప్‌ 2000 యానాం ఉపఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి పి.షణ్ముగంపై బీజేపీ అభ్యర్థఇగా గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత 2001లో ఎమ్మెల్యే ఎన్నికల్లో మల్లాడి కృష్ణారావు చేతిలో ఓటమి పాలయ్యారు. యానాంలో మల్లాడికి ప్రధాన ప్రత్యర్థిగా ప్రజల పక్షాన పోరాడిన గంగాధర ప్రతాప్‌ 2004లో గుండెపోటుతో చనిపోయారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ డిప్లొమో చేసిన అశోక్ రాజకీయాల పట్ల ఆసక్తితో సేవాకార్యక్రమాలు ప్రారంభించారు. తన తండ్రి మద్దతుదారులు, సన్నిహితుల అండతో ఎన్నికల్లో పోటీచేసి సీఎం అభ్యర్థిని ఓడించారు.