సామాజిక సారథి, సంగారెడ్డి ప్రతినిధి: వివిధ సమస్యల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే సందర్శకులు, అర్జీదారుల కోసం జిల్లా అధికార యంత్రాంగం మీసేవ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. మీసేవ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్ హనుమంతరావు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి కి సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవడానికి సులువుగా ఉంటుందని అన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- December 2, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Center
- COLLECTORATE
- SANGAREDDY
- Your Service
- కలెక్టరేట్
- కేంద్రం
- మీసేవ
- సంగారెడ్డి
- Comments Off on కలెక్టరేట్ లో మీసేవ కేంద్రం