సారథి న్యూస్, హుస్నాబాద్: పర్మిషన్ లేకుండా ఇండోర్ స్టేడియం కూల్చేస్తారా? అని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ ప్రశ్నించారు. హుస్నాబాద్ పట్టణంలో శివాజీ నగర్ బురుజు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.20లక్షల వ్యయంతో ఈ ప్రాంత క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం ఏర్పాటుచేశారని తెలిపారు. ప్రభుత్వాలు మారడంతో ఇండోర్ స్టేడియానికి ప్రత్యేకంగా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయన్నారు. గత మున్సిపల్ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై నూతన పాలకవర్గంలో కనీసం చేర్చించకుండా, కనీసం కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా రూ.3.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని కూల్చివేశారని మండిపడ్డారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్ బాబు అనుమతులు ఇవ్వకుండా అధికారముందని ఇష్టవచ్చినట్లు ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేస్తే ఊరుకోబోమన్నారు. క్రీడాకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్, బీజేపీ, ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ పార్టీల నాయకులు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రాజు, నాయకులు సది, కిష్టస్వామి, భిఖ్యానాయక్, రాజు, రవీందర్ పాల్గొన్నారు.
- March 2, 2021
- Archive
- తెలంగాణ
- CONGRESS
- HUSNABAD
- INDORE STADIUM
- INTEGRATED MARKET
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్
- ఇండోర్ స్టేడియం
- కాంగ్రెస్
- హుస్నాబాద్
- Comments Off on అనుమతి లేకుండా స్టేడియం కూల్చేస్తారా..?