– నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ వద్ద బావా బామ్మర్దులదే పెత్తనం
– పదిహేను రోజుల ముందు వచ్చి అంతా తమే అంటున్న బావ బామ్మర్దులు
– వీళ్ళ పెత్తనం ఏమిటంటు కార్యకర్తల అసహనం
సామాజిక సారధి , నాగర్కర్నూల్ బ్యూరో : నాగర్ కర్నూల్ నియోజకవర్గo లో ఇద్దరు చెంచా రాజకీయ నాయకులు బావ , బామ్మర్దులు అయినప్పటికీ ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే వారి వద్ద ఉంటూ ఎమ్మెల్యే అయినా తాము చెప్పిన సలహాలు, మాటలకే ప్రాధాన్యత నిస్తున్నారంటూ బయట చెప్పుకుంటూ ఎమ్మెల్యేల వద్ద తమ మాటే చలామణి అవుతుందని బయట ప్రచారం చేసుకుంటూ తమ పబ్బాన్ని గడిపేసుకుంటున్నారు . గత పది సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే వద్ద ఉన్న సదరు బావ బామ్మర్దులు ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ నియోజకవర్గానికి వచ్చాడంటే ఆయన వెంటే ఉంటూ ఏ కార్యకర్త వెళ్లి తన పని చేయించుకోవాలని వెళ్ళినప్పటికీ వీళ్ళిద్దరూ ఆ పనిలో కల్పించుకొని తమ సలహాలు సూచనల వల్లనే ఆ పనులు పూర్తవుతున్నాయంటూ బయట ప్రచారం చేసుకునే అలవాటు ఉంది . ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల ముందు మాజీ ఎమ్మెల్యే ను వదిలి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లో కి చేరిన సదరు బావ బామ్మర్దులు ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ వద్ద కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నారు . ఎమ్మెఎల్సి నియోజకవర్గంలో ఉన్నాడంటే చాలు ఆయన వెంట తిరుగుతూ క్యాంప్ ఆఫీసులో , వారి ఇంటి ముందు పొద్దున నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ చాయే , బిస్క్కెట్ తింట్ అక్కడికి వచ్చిన కార్యకర్తలతో మాట ముచ్చట చేస్తూ తాను ఆ పని పూర్తి చేయిస్తామంటూ చెప్పుకోవడం స్థానిక కార్యకర్తలు అసహనానికి గురి అవుతున్నారు . గత పది సంవత్సరాలుగా తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తున్న తమకు లేని ప్రాధాన్యత 15 రోజుల ముందు వచ్చిన వారికీ ఎందుకు ఇస్తున్నారు అంటూ విసిగి వాపోతున్నారు . అయినప్పటికీ వారు ఎమ్మెల్యే పక్కనుండే జరగపోవడంతో తాము సొంత పనులు కూడా ఎమ్మెల్సీ వద్ద చేయించుకోలేకపోతున్నామని కార్యకర్తలు సహనానికి గురి అవుతున్నారు . ఇప్పటికైనా నాయకులు చేరుకొని సదరు బావ బామర్ది ల ను కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు .