ఈ నెల 7నుంచి విధులకు డుమ్మాలీవ్ లెటర్ లేదు…
విధులకు హాజరు కావడం లేదు…
తమకు తెలియదంటున్న ఆ ధికారులు …
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ బ్యూరో:.నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఎంపీడీఓ పవన్ కుమార్ పది రోజులుగా విధులకు హాజరుకావడం లేదు. కనీసం ఎంపీడీఓ కార్యాలయంలో సెలవు పత్రం లేకుండా ఉన్నతాధికారుల అనుమతి కూడా లేకుండా ఎంపీడీఓ విధులకు దర్జాగా డుమ్మా కొడుతుండడం జిల్లాలో సంచలనంగా మారింది. ఈయన ఎంపీడీఓ గా విధులు నిర్వహిస్తున్నా ఏనాడూ తన చాంబర్ లోకి కింది స్థాయి ఉద్యోగులను రానివ్వకపోవడం విశేషం. అంతేకాకుండా గ్రామాభివృద్ది లో కీలకంగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను సైతం వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఉపాధిహామి సిబ్బందిని ఇబ్బందులను పెట్టడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు లు చేపించిన సంఘటనలు ఉన్నాయి. ఈ ఎంపీడీఓ మాకొద్దు అంటూ గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో పాటు ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది , ఇతర నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలవు పత్రం లేకుండా ఉన్నతాధికారుల అనుమతి కూడా లేకుండా ఈ నెల 7వ తేది నుంచి విధులకు డుమ్మా కొడుతున్న జిల్లాస్థాయి ఉన్నతాధికారులు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో బిజినపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఫించన్ లు, ఈజీఎస్ పనులు తదితర పనులకోసం వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు పడిగాపులు కాసి తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఈ విషయమై కార్యాల ఉద్ధ్యోగులను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని, లీవ్ పెట్టిన సంగతి కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు.