సారథి, హైదరాబాద్: సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకుని ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట షిర్డీసాయినగర్ కాలనీలోని సీతారామాలయంలో స్వామివారి కల్యాణం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల్లో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి దంపతులు హాజరై దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సీతారామాలయ కమిటీ అధ్యక్షుడు తిరుమల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్లస్వామి, కోశాధికారి కె.వెంకట్రావు, షిర్డీసాయినగర్ కాలనీ అధ్యక్షుడు కేకే ఎల్ల గౌడ్, ప్రధాన కార్యదర్శి బి.దేవా, కాలనీ కోశాధికారి కె.రాజు, ఆలయ కమిటీ మెంబర్లు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
- April 22, 2021
- Archive
- HYDERABAD
- LB NAGAR
- mansurabad
- sitharama kalyanam
- ఎల్బీ నగర్
- మన్సూరాబాద్
- సీతారాముల కల్యాణం
- హైదరాబాద్
- Comments Off on సీతారాముల కల్యాణం.. రమణీయం