సారథి, వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం రాచపల్లి క్రాస్ రోడ్ వద్ద పెళ్లి బృందం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం సాయంత్రం బర్లగూడెం పంచాయతీలోని ఒంటిమామిడిలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి ఛత్తీస్ గఢ్ బయలుదేరిన పెళ్లి ట్రాక్టర్ రాచపల్లి వద్ద ట్రాలీ లింక్ ఊడిపోవడంతో బోల్తాపడింది. ట్రాక్టర్ లో 30 మందికి పైగా ఉన్నారు. వీరంతా ఛత్తీస్ గఢ్ లోని నాంపల్లి గ్రామానికి చెందినవారు. క్షతగాత్రులను వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
- May 13, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- MULUGU
- tractor accident
- ఛత్తీస్ గఢ్
- పెళ్లి ట్రాక్టర్
- ములుగు
- వెంకటాపురం
- Comments Off on పెళ్లి ట్రాక్టర్ బోల్తా