సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని పెంటోనిచెరువు తూము నుంచి రైతులకు చెరువు కింద సుమారు వెయ్యి ఎకరాల ఆయకట్టులో పంటలు సాగుచేసేందుకు వీలుగా సర్పంచ్ గోవింద్ లావణ్య నాగరాజు, ఎంపీపీ పుప్పాల శ్రీనివాస్ గౌడ్ సోమవారం నీటిని విడుదల చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి గ్రామంలో చెరువులను నీటితో నింపిన ఘనత టీఆర్ఎస్ప్రభుత్వానికే దక్కిందన్నారు. రైతులు పంటలు పండించడానికి వీలుగా నీటి వసతి కల్పించిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రతిఒక్కరి ఇంట్లో పెద్దన్నగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో లింగసానిపల్లి సర్పంచ్ సుగుణమ్మ, లక్ష్మయ్య, ఉపసర్పంచ్ సత్తన్న, గ్రామ పంచాయతీ వార్డుసభ్యులు మాడుగుల స్వామి, చిక్కొండ్ర భాగ్యలక్ష్మి, గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి వసంత, చిక్కొండ్ర బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
- June 28, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- NAGARKURNOOL
- PALEM
- pentony cheruvu
- నాగర్ కర్నూల్
- పాలెం
- పెంటోనిచెరువు
- Comments Off on పెంటోనిచెరువు నుంచి ఆయకట్టుకు నీళ్లు