- చైనా వ్యవహారాల్లో ఆరితేరిన మిస్రీ
న్యూఢిల్లీ: చైనా వ్యవహారాల నిపుణుడైన విక్రమ్ మిస్రీ జాతీయ భద్రతా ఉపసలహాదారుగా నియమితులయ్యారు. చైనా వ్యవహారాల్లో ఆరితేరిన విక్రమ్.. బీజింగ్ లో భారత రాయబారిగా పనిచేశారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన.. డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా ఉన్న పంకజ్ సరణ్ నుంచి ఈనెల 31న బాధ్యతలను స్వీకరించనున్నారు. చైనాతో పాటు రష్యాలో కూడా భారత రాయబారిగా పనిచేసిన అనుభవం విక్రమ్‌కు ఉంది. అయితే ఎన్‌ఎస్సీఎస్ లో ఆయన చేరడంతో చైనా రాయబార బాధ్యతలను ప్రదీప్ కుమార్ రావత్ కు కేంద్రం అప్పగించింది. నూతన ఎన్‌ఎస్‌ఏ డిప్యూటీగా నియమితులైన విక్రమ్ మిస్రీ.. నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ అజిత్ దోవల్ కు నేరుగా రిపోర్టు చేయనున్నారు. ఇకపోతే, ఎన్‌ఎస్‌ఏ డిప్యూటీలుగా ఇప్పటికే రాజేందర్ ఖన్నా, దత్తా పంద్సల్ గికర్ బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం.