Breaking News

అమ్మో.. పులి..?

అమ్మో.. పులి..?
  • పంటపొలాల్లో పాద ముద్రలు

సామాజిక సారథి, నల్లగొండ:  నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రాయినిగూడెంలో చిరుత పులి కలకలం రేపుతోంది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. పంట పొలాల్లో ఓ జంతువుకు సంబంధించిన పాదముద్రలను స్థానికులు గమనించారు. వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి పంటపొలాల్లో ఉన్న పాద ముద్రలను పరిశీలించి హైనా పాదముద్రలుగా అనుమానిస్తున్నారు. కాగా, కొంత మంది ప్రత్యక్ష సాక్షులు నిజంగానే చిరుతను చూశామని, దానివెంట పులిపిల్లలు కూడా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. రాయినిగూడెం, రామలింగాలగూడెం గ్రామాల మధ్యలో ఉన్న జమాయిల్ తోటల పరిసరాల్లో అవి సంచరిస్తున్నాయని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అదేవిధంగా పొంట పొలాల్లో పాదముద్రలు ప్రతిరోజూ కొత్తవిగా కనిపిస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఫారెస్టు అధికారులు స్పందించి, అటవీ జంతువును పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అసలు అది పులినా, హైనానా అనేది స్పష్టం కవాల్సి ఉంది.