Breaking News

వ్యాక్సినేషన్ వేసుకోవాలి

వ్యాక్సినేషన్ వేసుకోవాలి

సామాజిక సారథి, జహీరాబాద్: ప్రజలు కోవిడ్ బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా కోరారు. సోమవారం జహీరాబాద్ మండలపరిధిలోని షేఖాపూర్ గ్రామ పంచాయతీ లో వాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో డోర్ టు డోర్ వాక్సినేషన్ కార్యక్రమములో పాల్గొని  మాట్లాడుతూ అందరూ వాక్సిన్ తీసుకోవాలన్నారు. కొవిడ్ క్రొత్త రకం ఒమిక్రాన్ కేసులు దేశములో పెరుగుతున్నాయనీ తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 31 వరకు వంద శాతం మొదటి డోసు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు.  అనంతరం జహిరాబాద్ మునిసిపాలిటీ పరిధి లోని అల్లిపూర్ కాలనీ లో వాక్సినేషన్ ప్రక్రియ ను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో  డిప్యూటీ జిల్లావైద్యాధికారి డాక్టర్ శంకర్, ఎంపీడీవో రాములు డాక్టర్ నవనీత్ , మహేశ్, సర్పంచ్,  లు పాల్గొన్నారు.