సారథి, నాగర్కర్నూల్: జిల్లాలో వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం నిర్వహణపై బుధవారం జిల్లా వైద్యాధికారి(డీఎంహెచ్వో) డాక్టర్ సుధాకర్లాల్ వైద్యాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. చిన్నారులను గుర్తించి సకాలంలో బీసీజీ టీకాలు వేయాలని సూచించారు. తదుపరి సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు హెచ్ఎంఐఎస్ ఆన్ లైన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు చేయించుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలని అన్నారు. టెలీమెడిసిన్ విధానాన్ని రోగులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్ దాస్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి, ఎస్ సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, రేణయ్య, సందీప్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.
- July 28, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- bcg vaccine
- NAGARKURNOOL
- zoom meeting
- జూమ్మీటింగ్
- నాగర్కర్నూల్
- బీసీజీ టీకాలు
- Comments Off on చిన్నారులకు సకాలంలో టీకాలు వేయండి