- జై భీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
సారథి న్యూస్, హైదరాబాద్: జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి మంగళవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల నియోజకవర్గ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, పార్ట్ టైం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని ప్రకటించారు. మండలిలో అన్ని వర్గాల తరఫున గొంతు వినిపిస్తానని అన్నారు. రాజకీయ పార్టీలు ఇప్పుడు కూడా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, యూనివర్సిటీల సమస్యలు, ఉద్యోగులు, ఉద్యోగాల గురించి ప్రస్తావించకుండా కుల,మత వారసత్వ రాజకీయాలు చేస్తుండడం చాలా సిగ్గుచేటని విమర్శించారు. పట్టభద్రులు జాగ్రత్తగా ఆలోచించి స్వార్థపూరిత పార్టీలకు బుద్ధిచెప్పాలని, మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.