![టీఆర్ఎస్సభ్యత్వ నమోదు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/TRS11.jpg?fit=677%2C280&ssl=1)
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పట్లొరీ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ సభ్యత్వ నమోదు చేయించారు. మండలంలోని అంబాజీపేట, చందాపూర్ గ్రామాల్లో సభ్యత్వాలు చేయించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సాన సాయిలు, పడాల రమాదేవి, శ్రీనివాస్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు ధ్యాప బాలకిషన్, మ్యాసగల్ల పెంటయ్య, గోపాల్ నాయక్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సుంకరి నవీన్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు పోతరాజు రాజు ముదిరాజ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు శేఖర్ గౌడ్, శేఖర్, సుధాకర్, రాజు, సిద్ధిరాములు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/TRS22.jpg?resize=640%2C264&ssl=1)