సామాజిక సారథి, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. టీఆర్ఎస్ కొంత వెనుకబడినట్లు కనిపిస్తోంది. బీజేపీ 6వ రౌండ్ ముగిసే సరికి 2,971 ఓట్ల ఆధిక్యంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 3,639(23,797) ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 4,656 (26,983 ) ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్వెంకట్కు 180 (992 ) ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం బీజేపీ 1,017 (3,186)ఓట్లతో లీడ్‌లో ఉందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా, 7 వ రౌండ్లో బీజేపీ 4,044 (31,027), టీఆర్ఎస్ కు 3,792 (27,589) ఓట్లు పడ్డాయి. ఈ రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 252 (3,438) ఓట్ల ఆధిక్యం కనబరిచారు.
- November 2, 2021
- Archive
- Top News
- counting
- ETA
- gellu srinivas
- TRS
- ఈటల
- టీఆర్ఎస్
- హుజూరాబాద్
- Comments Off on బ్రేకింగ్..హుజూరాబాద్ లో టీఆర్ఎస్ వెనుకంజ