- కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లో అంత్యక్రియలు
- నివాళులర్పించిన రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్,
- త్రివిధ దళాల అధిపతులు
న్యూఢిల్లీ: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన 13మందిలో ఒకరైన లెఫ్టినెంట్ కల్నల్హర్జిందర్ సింగ్ భౌతికకాయానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సహాయ మంత్రి అజయ్‌భట్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె, ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నేవీ అడ్మిరల్ హరికుమార్ ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలకు ముందు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లో హర్‌జిందర్ సింగ్ భౌతికకాయంపై రాజ్‌నాథ్ సింగ్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం కల్నల్హర్జిందర్సింగ్ సతీమణి మాజ్ అగ్నెస్ మనేజస్, కుమార్తె ప్రీత్‌కౌర్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. సీడీఎస్ బిపిన్ రావత్‌కు స్టాఫ్ ఆఫీసర్‌గా సేవలందించిన హర్జిందర్ సింగ్ 11 గూర్ఖా రైఫిల్స్‌కు చెందిన అధికారి. సీడీఎస్‌ది కూడా ఇదే రెజిమెంట్. సియాచిన్‌పై భద్రతాదళాల మోహరింపు, ఐక్యరాజ్యసమితి పరిరక్షక మిషన్, బెటాలియన్ ఆపరేషన్లలో విశేషమైన సేవలు అందించారు.