సారథి, రామడుగు: రామడుగు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చొప్పదండి సీఐ నాగేశ్వర్ రావును ఘనంగా సన్మానించారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాదపూర్వకంగా కలసి మండలంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఐ సమస్యల పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మాస్కులు, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వంచే రాజిరెడ్డి, గౌరవాధ్యక్షుడు గంటే భాస్కర్, ప్రధాన కార్యదర్శి కాసరపు తిరుపతి గౌడ్, సభ్యులు రహమత్, పురేళ్ల రవీందర్ గౌడ్, పంజాల భానుచందర్ గౌడ్, రామస్వామి, మహమ్మద్ రజాక్, రాజు, రమేష్, రాగం మహేష్ పాల్గొన్నారు.
- April 3, 2021
- Archive
- PRESSCLUB
- RAMADUGU
- ప్రెస్‌క్లబ్
- రామడుగు
- Comments Off on చొప్పదండి సీఐకి సన్మానం