నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘దసరా’ టీజర్ ను దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంచ్ చేశారు. టీజర్‌ను బట్టి చూస్తే కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నటీనటుల మేకోవర్‌లు, బొగ్గు గనుల్లో పనిచేసే వ్యక్తుల ప్రపంచాన్ని చూపించడం, వారు అనుసరించే ఆచారాల వరకు.. దసరా టీజర్ సరికొత్త అనుభూతిని అందిస్తుంది. మొదటి ఫ్రేమ్‌లో ధరణి (నాని) భారీ రావణుడి దిష్టిబొమ్మ ముందు నిలబడి ఉన్నట్లు ప్రజంట్ చేశారు. ‘వీర్లపల్లి.. సుట్టూర బొగ్గు కుప్పలు. తొంగి చూస్తే కానీ కనిపించని వూరు. మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం’ అని నాని వాయిస్ తో టీజర్ మొదలైయింది. ధరణి ప్రపంచం చాలా వైల్డ్ ఉంది. కొన్ని దుష్టశక్తులు గ్రామంలో సామరస్యానికి భంగం కలిగించినప్పుడు అతని ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని కలసి ఒక అద్భుతాన్ని అందించారు. నానీ బీడీ వెలిగించే విధానం, మద్యం సేవించిన తర్వాత అతను చేసే సంబరాలు జనాలకు గూస్‌బంప్స్ ని ఇస్తాయి. చివరి ఎపిసోడ్‌లో నాని తన వేలు కత్తికి రాజుకుంటూ రక్తం నుదుటిపై పెట్టుకోవడం అతని తిరుగుబాటు వైఖరిని తెలియజేస్తుంది. షైన్ టామ్ చాకో, సాయి కుమార్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించారు. టీజర్‌లో కీర్తి సురేష్ కనిపించలేదు. లాంచ్ ఈవెంట్ లో నాని మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. టీజర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్లో వుంటుంది. 2023లో సినిమా విడుదల తర్వాత కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. మార్చి 30 థియేటర్ లో కలుద్దాం’’ అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ మార్చి 30న థియేటర్ లో కలుద్దాం అన్నారు. నిర్మాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ఒక పెద్ద పండగలా వుంటుంది. నాని గారి నుంచి ఇలాంటి సినిమాని గతంలో ఎప్పుడూ చూసి వుండరు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. దసరా అవుట్ అండ్ అవుట్ ‘రా’, మాస్ మూవీ’’ అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ విజయ్, వెంకట్ రత్నం తదితరులు ఈవెంట్ లో పాల్గొన్నారు. మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.
- January 31, 2023
- Archive
- CINEMA GALLERY
- Top News
- సినిమా
- Cinema
- Comments Off on ట్రైలర్ అదిరింది..