Breaking News

సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం

సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం


న్యూఢిల్లీ : సీపీఎం జనరల్ సెక్రటరీ, సీనియర్​ నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి (35) కరోనాతో కన్నుమూశాడు. గురువారం ఉదయం 5.30 గంటలకు ఆయన గురుగ్రావ్ లోని మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రెండు వారాలుగా ఆశిష్ అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని సీతారాం ఏచూరి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ఈరోజు ఉదయం నా పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరిని కోల్పోయానని తెలియజేయడం నాకు చాలా విచారంగా ఉంది. అతడు కోలుకోవాలని కోరుకున్న ప్రతిఒక్కరికీ, ఆశిష్‌కు చికిత్స చేసిన వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు..’ అని ఏచూరి ట్వీట్ చేశారు. ఆశిష్ ఏచూరి ఢిల్లీలోని ఒక ప్రముఖ పత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. రెండు వారాల క్రితం ఆయనకు కరోనా నిర్ధారణ అయింది. అప్పట్నుంచి ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కానీ పరిస్థితులు విషమించి గురువారం ఉదయం కన్నుమూశారు.