Breaking News

సాగులో కూలీ ఖర్చులు తగ్గించుకోవాలే

సాగులో కూలీ ఖర్చులు తగ్గించుకోవాలే

సారథి న్యూస్, రామాయంపేట: ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా ఉపయోగించుకుంటే వ్యవసాయంలో మౌలిక మార్పులు సాధ్యమని మెదక్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ అన్నారు. నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామ రైతు వేదికలో శుక్రవారం రైతులకు పంటలో సమగ్ర పోషక యాజమాన్యం పద్ధతులు, వ్యవసాయ రంగానికి అవసరమైన ఉపాధి హామీ పథకం గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకుని రైతులు ఎదగవచ్చన్నారు. వరినాట్లు వేసే సమయంలో రైతులకు కూలీల ఖర్చులు భారంగా మారకూడదని, రైతులకు వెదజల్లే పద్ధతి గురించి వివరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రవికుమార్, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్, జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఏఈవో శ్రీలత, రైతుబంధు మండల కోఆర్డినేటర్ సంపత్, మాజీ సహకార సంఘం ఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.