సామాజికసారథి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని విద్యాసంస్థలకు మరో మూడు రోజుల పాటు సెలవులు పొడిగించింది. రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు (సోమవారం నుంచి బుధవారం వరకు) సెలవులు ప్రకటించిన విషయం విధితమే. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో మరో మూడు రోజుల పాటు సెలవులను మరోసారి పొడిగించారు. తిరిగి సోమవారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- July 13, 2022
- Top News
- Holidays
- rain effect
- TELANGANA
- తెలంగాణ
- వర్షాలు
- హాలీడేస్
- Comments Off on మరో మూడురోజులు విద్యాసంస్థలకు సెలవు