Breaking News

ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్

సారథి, రామడుగు: రాజకీయాల్లో ముక్కుసూటి మనిషి ఎమ్మెస్సార్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య అన్నారు. ఎమ్మెస్సార్ సొంత గ్రామమైన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెస్సార్ తెలంగాణ వాదిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఏఐసీసీ కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా విశిష్టసేవలు అందించారని కొనియాడారు. ఎమ్మెస్సార్ మరణం తెలుగు ప్రజలకు తీరని లోటని అన్నారు. ఆయన పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో వీడీసీ చైర్మన్ నాగుల రాజశేఖర్, గ్రామస్తులు పాల్గొన్నారు.